పెట్రోలు పోసుకొని ఉపాధ్యాయుడు ఆత్మహత్య

తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం జంగాలపల్లికి చెందిన బల్లి ప్రసాద్ (54) అనే ఉపాధ్యాయుడు అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం కోటలో పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఉత్తమనెల్లూరు ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో సెలవులు తీసుకుంటూ వైద్యం చేయించుకుంటున్నారు. ఆదివారం ఉదయం ఇంటి నుంచి బైక్ పై వెళ్లి గంటల తరబడి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సాయంత్రం సాగరామాల సమీపంలో కాలిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తరలించారు.

సంబంధిత పోస్ట్