చిన్నారుల జీవితంలోని మొదటి ఆరు సంవత్సరాలు మెదడు అభివృద్ధికి అత్యంత కీలకమని, ఈ దశలో సరైన పోషణ, సంరక్షణ అవసరమని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పేర్కొన్నారు. బుధవారం తన ఛాంబర్ లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 8వ పోషణ్ పక్షవాడా కార్యక్రమాల అవగాహన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఏప్రిల్ 9 నుండి 23 వరకు “సహీ పోషణ్, దేశ్ రోషన్” నినాదంతో ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.