వ్యాపారుల కష్టాలు తీర్చడమే లక్ష్యం: పొంగూరు షరణి

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నిరుపేద వీధి వ్యాపారులను ఆదుకునేందుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుటుంబం ముందుకు వచ్చింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం, తోపుడు బండ్ల అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుతున్న పేద వీధి వ్యాపారులకు విడతలవారీగా తోపుడు బండ్లను పంపిణీ చేస్తున్నారు. తాజాగా మంగళవారం, మంత్రి కుమార్తె పొంగూరు షరణి చేతుల మీదుగా నెల్లూరు క్యాంపు కార్యాలయంలో 86 మందికి ఉచితంగా తోపుడు బండ్లను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్