గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ పెరగడంతో నెల్లూరులో కొత్త తరహా దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల బుచ్చిలో మూడు సిలిండర్లు దొంగిలించబడగా, తాజాగా నెల్లూరు రూరల్ వెల్లంటిలో రెండు సిలిండర్లను అపహరించారు. వెల్లంటిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ దొంగతనంపై స్థానిక అంగన్వాడీ టీచర్ మమత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.