నెల్లూరు సౌత్ స్టేషన్‌లో గుర్తు తెలియని వృద్ధుడి మృతి

నెల్లూరు రైల్వే సౌత్ స్టేషన్‌లో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. అతని ఎత్తు 5.5అడుగులు, బ్లూ చొక్కా, నల్ల పంచె ధరించి ఉన్నాడు. రైల్వే ఎస్ఐ హరిచందన మృతదేహాన్ని పరిశీలించారు. అతను సహజంగా మృతి చెందారని తెలిపారు. వయోభారంతో మృతి చెంది ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్