కోవూరు నియోజకవర్గ ప్రజలు తనపై చూపుతున్న ఆదరాభిమానాలు చూసి ఓర్వలేకే ప్రసన్న చెవాకులు పేలుతున్నాడని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విడవలూరు మండలం వరిణి, దండిగుంట గ్రామాలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇంటిటికెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. యోగ క్షేమాలు విచారిస్తూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు.