విశాఖ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన విజయవాడ నుంచి గూడూరు వరకు వివిధ రైల్వే స్టేషన్లను తనిఖీ చేస్తారు. నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో మధ్యాహ్నం అధికారులతో కలిసి అభివృద్ధి పనుల పనితీరును పరిశీలించనున్నారు. రైల్వేస్టేషన్ అధికారులు జీఎంకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.