చేపల వేటకు వెళ్లి యువకుడి గల్లంతు

శుక్రవారం కొలపనారుడుపల్లిలో చేపల వేటకు వెళ్లిన కొమ్మల శివకోటయ్య (35) అనే యువకుడు కండలేరు జలాశయంలో గల్లంతయ్యాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి వల వేస్తుండగా శివకోటయ్య అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. చేజర్ల పోలీసులు బోట్లు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వర్షం రావడంతో గాలింపునకు ఆటంకం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్