మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం నెల్లూరుకు రానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు వచ్చి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారు. అనంతరం 11:50 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నెల్లూరు సుజాతమ్మ కాలనీలోని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం 1:15 కు ఆయన బెంగుళూరుకు బయలుదేరి వెళుతారు.