వరి కోతలు ప్రారంభమై, ధాన్యం చేతికొస్తున్న సమయంలో సరైన గిట్టుబాటు ధర లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. నెల్లూరు జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి, వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.