నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ తల్లి, దివంగత కోడూరు అయ్యప్ప రెడ్డి సతీమణి, వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి అత్త అయిన కోడూరు సరస్వతమ్మ గత రాత్రి మృతి చెందారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆమె తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు బాలాజీ నగర్లో అంతిమయాత్ర జరగనుంది.