కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 106 సంవత్సరాలుగా కృషి చేస్తున్న ఏకైక సంస్థ ఏఐటీయూసీ అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటసుబ్బయ్య తెలిపారు. బుధవారం నెల్లూరులోని రామకోటయ్య భవన్‌లో జరిగిన ఏఐటీయూసీ నెల్లూరు జిల్లా 15వ మహాసభలో ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ ప్రభుత్వం కాలరాయడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.