ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ చేసిన కలెక్టర్

నెల్లూరులోని అమీన్‌నగర్‌లో అర్హులైన లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం తెలిపారు. ఆయన స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు పంపిణీ చేశారు. వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, బెడ్‌రిడెన్ బాధితులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం సామాజిక భద్రతను బలోపేతం చేస్తోందని, ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్