వృద్ధులకు దుప్పట్లు పంపిణీ, దోమల నివారణకు డిమాండ్

డివైఎఫ్ఐ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం 5వ డివిజన్ వైకుంఠపురంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు షేక్ మస్తాన్ బి ముఖ్యఅతిథిగా హాజరై పేద వృద్ధులకు దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నగర కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ, వైకుంఠపురంలో గిరిజనుల బ్రతుకులు అధ్వానంగా ఉన్నాయని, దోమల సమస్యతో రాత్రివేళ నిద్రపోలేకపోతున్నారని తెలిపారు. దోమల నివారణకు కార్పొరేషన్ తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్