భార్యను చూసేందుకు వెళ్తూ భర్త మృతి

నెల్లూరు గ్రామీణ మండలం జొన్నవాడ ఆర్చి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొండ్లపూడి గ్రామానికి చెందిన పుట్ట సునీల్ (30) అనే యువకుడు మృతి చెందారు. తాపీ పనులు చేసుకునే సునీల్, అత్తగారింట్లో ఉన్న తన భార్య, నెల రోజుల పాపను చూసేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, దేవరపాలెం నుంచి నెల్లూరు వైపు వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే మరణించారు. మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్