కందమూరు ఉప్పుటూరులో సిసి రోడ్ల ప్రారంభోత్సవాలు

నెల్లూరు రూరల్ పరిధిలోని కందమూరు, ఉప్పుటూరు గ్రామాలలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలు అని, ఎన్నికలు లేని వేళ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్