కార్మికుల కడుపులు కొట్టి కార్పొరేట్లకు దోచిపెట్టే లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు కే అజయ్ కుమార్, జి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో కార్మిక సంఘాల విస్తృత సమావేశం నిర్వహించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.