నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, స్థానిక 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో నారాయణ హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన 'నేత్ర జ్యోతి' ఉచిత కంటి వైద్య శిబిరంలో శనివారం పాల్గొన్నారు. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ సూచనల మేరకు పేదల కోసం అన్ని డివిజన్లలో ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మేయర్ తెలిపారు.