జిల్లాలో ధాన్యం సేకరణలో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తేమ శాతం, తరకలు, రాళ్లు, లారీలు లేవని కారణాలు చూపుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 3 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేసి 11 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేసినా, మద్దతు ధర రూ.20,300 ఉన్నా దళారులు రూ.17వేలకు కొనుగోలు చేస్తున్నారు. గొనె సంచులు, కొరత కల్లాలు కూడా రైతులను వేధిస్తున్నాయి.