రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ఈ పంపిణీ కొనసాగుతుందని, నెల్లూరు రూరల్ లో మొత్తం 4 వేల రైతు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, బూడిద విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్