తోటపల్లిగూడూరు మండలం విలుకానిపల్లె గిరిజన కాలనీలో ఆదివారం చోటుచేసుకున్న ఘటనలో, 108 వాహన సిబ్బంది చలనం లేకుండా పుట్టిన శిశువుకు సీపీఆర్ చేసి ప్రాణం నిలిపారు. మేకల జానకికి పురిటి నొప్పులు రావడంతో 108 బృందం వచ్చి కాన్పు చేశారు. కవలలలో ఒకరు చలనం లేకుండా ఉండగా EMT సురేశ్ సీపీఆర్ చేసి రికవరీకి దోహదం చేశారు. తల్లి, శిశువులను నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.