నెల్లూరు: 'కారుణ్య నియామకం ద్వారా విధుల కేటాయింపు'

నెల్లూరు నగర పాలక సంస్థలో ఎంబేటి రాగయ్య అనే వ్యక్తి రికార్డు అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ మరణించాడు. దీంతో ఆయన కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే దిశగా కారుణ్య నియామకం ద్వారా అతని కుమారుడు ఇ. సంతోష్ కుమార్ కు ఇంజినీరింగ్ విభాగంలో లైటింగ్ సూపరింటెండెంట్ గా విధులను కేటాయిస్తూ కమిషనర్ వై. ఓ. నందన్ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం కమిషనర్ ఛాంబర్ లో బుధవారం కారుణ్య నియామకం పత్రాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్