అందరి సహకారంతోనే నెల్లూరు బారాషహిద్ దర్గా రొట్టెల పండుగ విజయవంతమైందని, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం దర్గా ఆవరణలోని ఏపీ టూరిజం పార్కు ఆవరణలో వక్ఫ్ బోర్డు, దర్గా ఫెస్టివల్ కమిటీ ఆధ్వర్యంలో రొట్టెల పండుగ ముగింపు సభ ఘనంగా నిర్వహించారు. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.