నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్, భగత్ సింగ్ కాలనీలో 62 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ డ్రైన్ లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ లో జరిగే అభివృద్ధి రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదన్నారు.