నచ్చిన కళాశాలలో చేర్పించలేదని మనస్తాపం చెందిన 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. విజయవాడలోని ఓ యూనివర్సిటీలో బీటెక్ చేరాలని ఆమె కోరుకుంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా తండ్రి అందుకు అంగీకరించకపోవడంతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.