నెల్లూరు: కారుపై పడ్డ భారీ వృక్షం

నెల్లూరు నగరంలో గంటపాటు ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల ధాటికి స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (DMHO) కార్యాలయ ఆవరణలో ఉన్న ఒక భారీ వృక్షం ఒక్కసారిగా అక్కడ పార్క్ చేసి ఉన్న కారుపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నలిగిపోయి డ్యామేజ్ అయింది. అయితే, చెట్టు పడే సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో త్రుటిలో పెద్ద ప్రాణాపాయం తప్పింది.

సంబంధిత పోస్ట్