రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల విషయంలో తీసుకున్న పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్) నిర్ణయాన్ని సీపీఐ నేతలు తీవ్రంగా విమర్శించారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్మించాలని డిమాండ్ చేస్తూ, భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నెల్లూరు రూరల్ ఆధ్వర్యంలో కొత్త వెల్లంటి గ్రామంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి మాట్లాడుతూ, పీపీపీ పేరుతో మెడికల్ కళాశాల నిర్మితమైతే వైద్యం పూర్తిగా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.