అధునాతన డ్రోన్ సాంకేతిక విధానం ద్వారా నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న నక్ష సర్వే ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, కమిషనర్ వై. ఓ నందన్ సూచించారు. భారత ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భూ వనరుల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నక్ష సర్వే పై అవగాహన కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం నుంచి అధికారులు పాల్గొన్నారు.