మొంధా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలతో ఇబ్బందులు పడ్డ కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు, నెల్లూరులోని బాలాజీ నగర్ 68వ రేషన్ షాప్ లో నెల్లూరు ఆర్డిఓ అనూష, తహసిల్దార్ షఫీ మాలిక్ ఆధ్వర్యంలో గురువారం తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సహాయక చర్యలు బాధితులకు కొంత ఊరటనిచ్చాయి.