నెల్లూరు: బారాషాహిద్ దర్గాను సందర్శించిన ఉండవల్లి

గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవం బారాషహిద్ దర్గా రొట్టెల పండగని రాష్ట్ర మాదిగ సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. బుధవారం సాయంత్రం నెల్లూరు బారాషాహిద్ దర్గాను సందర్శించి, స్వర్ణాల చెరువులో ఆరోగ్య రొట్టెను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు రొట్టెల పండుగకు 400 ఏళ్ల పైగా ఘన చరిత్ర ఉందని, ఇటువంటి గొప్ప పండుగలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్