నెల్లూరు రూరల్ పరిధిలోని మహాత్మా గాంధీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ కమిటీలో భాగంగా కెఎన్ఆర్ పాఠశాల గురువు వి. వెంకట రెడ్డిని టిడిపి కో -క్లస్టర్ ఇంచార్జ్ తిప్పిరెడ్డి మమతారెడ్డి ఘనంగా సత్కరించారు. గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నెల్లూరు కేఎన్ఆర్ స్కూల్లో తాను చదువుకున్నానని సైన్స్ మాస్టర్ గా వెంకట్ రెడ్డి విద్యాబుద్ధులు నేర్పారని పేర్కొన్నారు.