జైలు నుంచి ఖైదీ పరారు

నెల్లూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాపట్ల జిల్లా భట్టిప్రోలు గ్రామానికి చెందిన షేక్ చిన్న సైదులు అనే ఖైదీ పరారయ్యాడు. 2022లో భార్య హత్య కేసులో శిక్ష పడిన అతను మొదట రాజమండ్రి జైలులో రెండేళ్లు శిక్ష అనుభవించగా అనంతరం నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించబడ్డాడు. సత్ప్రవర్తన కారణంగా అతన్ని ఓపెన్ జైలుకు మార్చగా, అక్కడ వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో తప్పించుకున్నాడు.

సంబంధిత పోస్ట్