బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన సోమిరెడ్డి

నెల్లూరులో జరుగుతున్న బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించారు. రొట్టెల పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు, పటిష్ట భద్రతా ఏర్పాట్లతో ఉత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయని వక్ఫ్ బోర్డు చైర్మన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్