విద్యార్థుల ఇబ్బందులపై ఆర్టీసీ ఆర్‌ఎంకు ఎస్ఎఫ్ఐ వినతి

నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులు తగినన్ని బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెన్ను నరేంద్ర శనివారం తెలిపారు. ఈ సమస్యపై ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులతో కలిసి ఆయన ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థుల ప్రయాణ అవసరాలను తీర్చడానికి మరిన్ని బస్సులను నడపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టీ విక్రం, జిల్లా కమిటీ సభ్యులు యగ్నేష్, అమర్, యశ్వంత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్