నెల్లూరు: సుధీర్ కుటుంబానికి కుట్టు మిషన్ అందజేత

నెల్లూరు జిల్లా గూడూరు పట్టణానికి చెందిన పడదల సుధీర్ ఇటీవల మరణించడంతో, ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు జంగమ సమాజం నెల్లూరు శాఖ ముందుకు వచ్చింది. సమాజం ఆధ్వర్యంలో శనివారం సుధీర్ కుటుంబ సభ్యులను కలిసి కుట్టు మిషన్ ను అందజేశారు. వారి పిల్లల చదువుకు తమ వంతు సహాయం అందిస్తామని జంగమ నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బృంగి మల్లేశ్వరరావు, మామిడి మహేష్, పుల్లూరు నాగరాజు, బృంగి ఉమామహేశ్వరరావు, కే వై దయ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్