నెల్లూరు రూరల్ వడ్డిపాలెం వద్ద తోటపల్లి గూడూరు ఎంపీడీవో వెంకటేశ్వర్ రావు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీడీవో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడగా, కారు దెబ్బతింది. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.