జనవరి 20న ఉదయగిరి(M) ఆర్లపడియ అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ కర్నాటి ఇంద్రసేనారెడ్డి తెలిపారు. సీతారామపురం(M) బసినేనిపల్లికి చెందిన చెదులూరి యాకోబ్, నెల్లూరు సిటీ కొత్తూరు అంబాపురానికి చెందిన గురునాథం మల్లికార్జునలను వాహనంతో సహా దుంగలను గ్రామస్థులు పోలీసులకు పట్టించారు. వారిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.