35 కిలోమీటర్ల నందవరం-ఉదయగిరి రోడ్డు నిర్మాణం రెండు నియోజకవర్గాలను కలిపే కీలకమైనది. సింగిల్ రోడ్డు కావడంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. 50 ఏళ్లుగా రోడ్డు కోసం ఎదురుచూస్తున్నా నిరాశే ఎదురవుతోంది. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల మధ్య ఈ రహదారి ఉండటంతో పనులు ముందుకు సాగడం లేదు. చుట్టుపక్కల హైవేలు ఉన్నా ఈ ఒక్క రోడ్డు పనులు మాత్రం పూర్తి కావడం లేదు. ముఖ్యమంత్రి దీనిపై స్పందించి పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.