ఆత్మకూరు పట్టణంలోని పలు సచివాలయాల్లో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా సాధన నిర్వహించారు. పట్టణంలోని ఏడు సచివాలయాల పరిధిలో మహిళలు, పెద్దలు, చిన్నారులు ఉత్సాహంగా యోగాసనాల్లో పాల్గొన్నారు. యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ప్రతిరోజూ సాధన చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని సచివాలయ సిబ్బంది స్థానికులకు సూచించారు. స్థానికులు సచివాలయ సిబ్బంది సూచనల మేరకు యోగాసనాలు వేశారు.