అమరావతి స్కూల్ విద్యార్థికి జిల్లా స్థాయిలో రెండో బహుమతి

పొదలకూరు అమరావతి స్కూల్ విద్యార్థి కుశల సాయి సందీప్, జిల్లా స్థాయిలో జరిగిన ఈనాడు ప్రతిభ పాటవ పోటీలలో స్పీచ్ ఇవ్వటంలో రెండో స్థానం సాధించి, అమరావతి విద్యాసంస్థ పేరును శిఖరానికి చేర్చారు. ఈ సందర్భంగా నెల్లూరు డీఈఓ బాలాజీ మాట్లాడుతూ చదువుతో పాటు అన్ని రంగాలలో అమరావతి స్కూల్ ముందుండటం సంతోషంగా ఉందని అభినందించారు. గొప్ప విజయాలు నిరంతర సాధనతోనే సాధ్యమవుతాయని, అందుకు విద్యాసంస్థ, అధ్యాపక బృందం నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓతో పాటు సర్వోదయ ప్రిన్సిపాల్, ఈనాడు మేనేజర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్