మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామంలో తూర్పు వీధిలో వెలసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో అంకమ్మ తల్లి తిరునాళ్లు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రజక సంఘం ఆధ్వర్యంలో ఈ తిరునాళ్లను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అనంతరం పుట్ట మట్టి తెచ్చి అమ్మవారిని తయారు చేసి పూజలు చేస్తారు. ఆదివారం అంకమ్మ పోలేరమ్మ తల్లికి పొంగళ్ళు పొంగించి ముక్కులు తీర్చుకుంటారు.