అట్టహాసంగా పెంచలకోన బ్రహ్మోత్సవాలు

జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన మంగళవారం ధ్వజారోహణం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ వేదమంత్రాలు పఠించారు. గరుత్మంతుడి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి, తెల్లని గుడ్డపై తయారు చేసిన గరుత్మంతుడి ప్రతిమను ధ్వజస్తంభంపై ఎగరవేసి దేవతలకు ఆహ్వానం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్