ద్విత్వా తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలో భారీగా వరద నీరు చేరింది. చెన్నై-కలకత్తా హైవేపై కాకుటూరు నుండి వెంకటాచలం వరకు ఒక వైపు భారీగా నీరు చేరడంతో వాహనాలను ఒకే వరుసలో మళ్లించారు. దీంతో నెల్లూరు నుండి చెన్నై వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. విక్రమ సింహపురి యూనివర్సిటీ వద్ద నుండి నెల్లూరు వైపు వచ్చే మార్గంలో సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. VS యూనివర్సిటీ దాటాక ఈనాడు ఆఫీస్ సమీపంలో హైవేపై మూడు అడుగులకు పైగా నీరు చేరింది.