తుఫాను ప్రభావంతో మనుబోలు మండలంలో గత నాలుగు రోజులుగా ఎడతెరపు లేని వర్షం కురుస్తోంది. దీనితో చలి తీవ్రత పెరిగి, వాగులు, వంకలు, కుంటలు, పొలాలు నిండుతున్నాయి. కురుస్తున్న వర్షానికి వేసిన వరి నాట్లు, నారడుగులు మునిగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.