మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఉదయం ప్రదోషకాలంలో అర్చకులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. జీడిపప్పులతో స్వామివారికి విశేష అలంకరణ చేశారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.