మనుబోలు: బీసీ హాస్టల్ ప్రారంభం

మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలోని నారపరెడ్డి సీతారామరెడ్డి జడ్పీ హైస్కూల్‌కు అనుబంధంగా ఏర్పాటు చేసిన బీసీ వసతి గృహాన్ని జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ గురువారం ప్రారంభించారు. గతంలో బద్దెవోలులో ఉన్న వసతి గృహం మూసివేయగా, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చొరవతో అక్కంపేటలో మళ్లీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాంబ వతమ్మ కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్