మనుబోలు మండల కేంద్రంలోని చెర్లోపల్లి గేటు వద్ద సోమవారం జానపద వృత్తి కళాకారుల సంఘం మరియు తిరుపతి రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్తంగా సోమవారం ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి. శశిధర్ రెడ్డి రోగాల పరీక్షించి ఉచితంగా మందులను అందజేశారు. అవసరమైన వారికి ఆపరేషన్లు తమ హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తామన్నారు.