మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల్లూర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్ రోడ్ వద్ద ఎస్సై శివ రాకేష్ ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజాము నుంచే చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఎస్సై మాట్లాడుతూ.. జగన్ పర్యటనకు ఎవరికీ అనుమతి లేదని అన్నారు. ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని, ఎవరైనా నిబంధనలు అతిక్రమించాలని చూస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.