మనుబోలు: పిచ్చి కుక్కల స్వైర విహారం.. 20 మందికి గాయాలు

మనుబోలులోని కోదండరామపురంలో పిచ్చికుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. గురువారం సుమారు 20 మందిని కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమళ్ల పాలెంలో ఆరు పిచ్చి కుక్కలు సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు. కోదండరామపురం బీసీ కాలనీ, చంద్రమౌళి నగర్ తదితర ప్రాంతాలలో వీటి సంచారం ఎక్కువగా ఉంది. మనుబోలులోని హైస్కూల్ ప్లస్ లో ఓ అధ్యాపకుని, కోదండరాంపురంలో ఓ చిన్నారిని పిచ్చి కుక్కలు కాటు వేసాయి. వీరికి గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్