మనుబోలు మండలం మడమనూరు గ్రామానికి చెందిన క్యాన్సర్ పేషెంట్ శేషురెడ్డికి శ్రీ సేవానాదం ట్రస్ట్ ఫౌండర్ మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆర్థిక సహాయంగా ఆదివారం అందజేశారు. శేషురెడ్డి క్యాన్సర్ చికిత్స కోసం బెంగళూరులోని ఆసుపత్రిలో చేరారు. చికిత్స కోసం ఇప్పటికే 9 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. ఇంకా 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో ఆయన, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.